Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

దళిత పారిశ్రామికశక్తిని చాటాలి

దళిత పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. అన్నిరంగాల్లో దళితులు రాణించినప్పుడే సమానత్వం సాధ్యమని చెప్పారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే విజయం మనవెంటే ఉంటుందని అన్నారు. దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కి) మూడు రోజులపాటు నిర్వహించనున్న పారిశ్రామిక, వాణిజ్య ప్రదర్శన -2015ను శుక్రవారం హైటెక్స్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. దళిత పారిశ్రామికవేత్తలపై వరాల జల్లు కురిపించారు. ఒక్క పారిశ్రామికరంగంలోనే కాదు.. ఐటీ, విద్య, వ్యాపార, నిర్మాణ రంగాల్లోనూ ఎస్సీ, ఎస్టీలు రాణించాలి. అప్పుడే సమానత్వం సాధ్యం. అందుకే తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. అన్ని వర్గాలతో సమానంగా నడువాలి.

CM-KCR-addressing-in-DICCI-meeting

-ఎస్సీ, ఎస్టీలు అన్ని రంగాల్లో రాణించాలి -డిక్కి ఎక్స్‌పో ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ -పారిశ్రామిక పార్కుల్లో 22% స్థలాలు దళితులకే.. -ఔత్సాహికులకు రూ.5 కోట్లు మార్జిన్‌మనీ -ఎకరం స్థలంలో.. ఐదు కోట్లతో ఇంక్యుబేషన్ సెంటర్.. -200 మంది దళిత, గిరిజన కాంట్రాక్టర్ల తయారీకి ప్రణాళిక -ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో డిక్కిని భాగస్వామ్యం చేస్తాం: సీఎం -హైదరాబాద్‌లో ఆదివారాలు వ్యాపారాలు నడవాలని సూచన -తెలంగాణ పారిశ్రామిక విధానం భేష్ : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ -దేశానికే ఆదర్శం టీ పాస్ :డిక్కి అధ్యక్షుడు మిలింద్ కాంబ్లీ దళిత శక్తిని చాటాలి.. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి. విజయం మన వెంట ఉంటుంది అని ముఖ్యమంత్రి అన్నారు. దళితులు, గిరిజనులు సెకండ్‌గా ఉండొద్దు.. ఫస్టుగానే నిలవాలి అని పిలుపునిచ్చారు. దేశంలోని ఎస్సీ, ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైనా వచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెట్టొచ్చని చెప్పారు. అలాంటివారికి రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ఇండస్ట్రియల్ పార్కుల్లో 22% మేరకు స్థలాలను ఎస్సీ, ఎస్టీలకే రిజర్వ్ చేశామని, వాటి కొనుగోలులోనూ రాయితీలు ఇస్తున్నామని సీఎం చెప్పారు. డిక్కి విజ్ఞప్తి మేరకు హైదరాబాద్‌లో ఎస్సీ, ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్స్ కోసం ప్రత్యేక ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

దానికి హైదరాబాద్ నగర శివార్లలోనే ఎకరం స్థలం, నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీల ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు స్కిల్స్ ఉంటాయి కానీ పెట్టుబడులు ఉండవని సీఎం అన్నారు. పెట్టుబడులకోసం బ్యాంకర్లను సంప్రదిస్తే ముప్పు తిప్పలు పెడతారని చెప్పారు. అందుకే వారికి ప్రభుత్వమే మార్జిన్ మనీని రూ.5 కోట్ల వరకు సీదా అందజేస్తామన్నారు. దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలు అన్నిరంగాల్లో అభ్యున్నతి సాధించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహాన్ని ఇస్తున్నదని తెలిపారు. అందులో భాగంగానే 200 మంది ఎస్సీ, ఎస్టీలను కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలను పారిశ్రామిక విధానంలోనే పేర్కొన్నామని గుర్తు చేశారు. ఆసక్తి కలిగిన ఇంజినీరింగ్ నిరుద్యోగ యువతను ఎంపిక చేసి రెండు, మూడు నెలల్లోనే ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కాంట్రాక్టర్లుగా తయారు చేయడమే కాదు.. వారికి ప్రభుత్వం చేపట్టే పనులను అప్పగించే ప్రక్రియ కూడా ఉంటుంది అని సీఎం చెప్పడంతో సభా ప్రాంగణం హర్షధ్వానాలతో మార్మోగింది.

ప్రపంచంలోనే ది బెస్ట్ తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన పారిశ్రామిక విధానం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని కేసీఆర్ చెప్పారు. ఇలాంటి విధానం ప్రపంచంలోనే మరెక్కడా లేదని అన్నారు. దీనిని కొద్ది రోజుల్లోనే అమల్లోకి తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. వేధింపులు ఉండవు. అవినీతి కనిపించదు. 15 రోజుల్లోనే అన్ని రకాల అనుమతులు ఇచ్చే సింగిల్‌విండో విధానం అమలు చేస్తాం. అధికారిక వెబ్‌సైట్‌నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవడం, దాన్ని పూరించడం, మళ్లీ అప్‌లోడ్ చేయడంతోనే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. వెంటనే అధికారుల నుంచి దరఖాస్తుదారుడికి ఆహ్వానం అందుతుంది.

ఎయిర్‌పోర్టులో దిగగానే ప్రోటోకాల్ అధికారులు దగ్గరుండి సీఎం ఆఫీసుకు తీసుకొస్తారు. కాఫీ తాగుతూ పది నిమిషాల్లో చర్చిస్తాం. 15 రోజుల్లో అన్ని రకాల అనుమతులతో కూడిన ప్యాకెట్‌ను అదే తీరున చేతికి అందిస్తాం అని పారిశ్రామిక విధానం గొప్పతనాన్ని ఆయన టూకీగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వంకూడా అనేక పథకాలను అమలు చేస్తున్నదని సీఎం అన్నారు. కేంద్రం ప్రొక్యూర్‌మెంట్ పాలసీలో 4% ఎస్సీ, ఎస్టీలకు కేటాయించడంద్వారా ఎంతో మేలు కలుగుతుందని అభిప్రాయపడ్డారు.

ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించిన నీతి అయోగ్ సమావేశంలో పాల్గొని పలు సూచనలు చేసినట్లు తెలిపారు. ప్రగతిశీల పద్ధతుల్లోనే ప్రధాని ఆలోచిస్తున్నారని కొనియాడారు. నిరుద్యోగ యువత గ్లోబల్ ఆపరేటింగ్ సిస్టంతో ఆలోచించాలని సూచించారు. డిక్కి నాట్ జాబ్ సీకర్, బీ జాబ్ గివర్స్ (ఉద్యోగాలు కోరుకునేది కాదు.. ఉద్యోగాలు కల్పించేది) అనే నినాదాన్ని సీఎం ఇచ్చారు. అదే నినాదంతో ముందుకు నడువాలని పిలుపునిచ్చారు.

ఆదివారమూ దుకాణాలు తెరువచ్చు..కానీ మెట్రోపాలిటన్ నగరమైన హైదరాబాద్ మరింతగా విస్తరించనుందని, ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్యలు నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. అదే క్రమంలో గ్లోబల్ మార్కెట్‌ను అనుసరించి మహానగరంలో వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలను ఆదివారం కూడా నడుపుకోవాలని సూచించారు. అదేసమయంలో వాటిల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు వారాంతపు సెలవు తప్పనిసరిగా ఉండేటట్టు షెడ్యూలు ఖరారు చేసుకోవాలని వ్యాపారులను కోరారు.

టీ పాస్ దళిత మిత్ర విధానం: నిర్మలా సీతారామన్ తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన పారిశ్రామిక విధానం దళిత మిత్రగా ఉండటం అభినందనీయమని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కేంద్రం కూడా దీనికి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. డిక్కి పదేళ్ల ప్రస్థానం ప్రశంసనీయమని కొనియాడారు. ఆత్మ విశ్వాసంతో, చైతన్యంతో విజయాన్ని సాధించాలని సూచించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు క్రెడిట్ అండ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.

డిక్కి వ్యవస్థాపక అధ్యక్షుడు మిలింద్ కాంబ్లీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన పారిశ్రామిక విధానానికి తానే అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నానని చెప్పారు. అన్ని రాష్ర్టాల్లో పర్యటిస్తూ ఎస్సీ, ఎస్టీలకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తున్నదని ప్రచారం చేస్తున్నానని తెలిపారు. దళిత్ ఫ్రెండ్లీ పాలసీ దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే అమలు చేస్తున్నారని కొనియాడారు. డిక్కి దక్షిణాది రాష్ర్టాల అధ్యక్షుడు నర్రా రవికుమార్ మాట్లాడుతూ.. పాలకులంతా ఎస్సీలకు సంక్షేమం మాత్రమే కావాలని ఆలోచించారని, అదే తీరున పథకాలను అమలు చేశారని, ఒక్క కేసీఆర్ మాత్రమే ఎస్సీలకు సంక్షేమం కాదు.. అభివృద్ధి కావాలని వినూత్నంగా ఆలోచించారని చెప్పారు.

అందుకే ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌ను ఎస్సీ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌గా మార్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీలకు రూ.100 కోట్లు మాత్రమే కేటాయిస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది జిల్లాల పరిధిలోనే రూ.680 కోట్లకు బడ్జెట్‌ను అమలు చేస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో గోద్రేజ్ గ్రూప్ సంస్థల మాజీ అధ్యక్షుడు ఆది గోద్రేజ్, బాంబే స్టాక్ ఎక్సేంజ్ సీఈవో ఆశిష్‌కుమార్ చౌహాన్, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ సీఎండీ రవీంద్రనాథ్, దళిత్ డైరీ కాలమిస్ట్ చంద్రభానుప్రసాద్, మహారాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజ్‌కుమార్ బడోలా తదితరులు ప్రసంగించారు.

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీ లకా్ష్మరెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే ప్రదీప్‌చంద్ర, టీఎస్‌ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ జయేశ్‌రంజన్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ రాములునాయక్, సీఐఐ తెలంగాణ చైర్‌పర్సన్ దాట్ల వనిత, డిక్కి తెలంగాణ అధ్యక్షుడు పీ శ్రీనివాస్, వివిధ రాష్ర్టాల డిక్కి ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.