రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (డిక్కీ) ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను శుక్రవారం కలిశారు. హైదరాబాద్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 13 నుంచి మూడురోజులపాటు నిర్వహించే డిక్కీ పారిశ్రామిక ప్రదర్శనకు సీఎంను ఆహ్వానించారు. ఈ సందర్భంగా డిక్కీ ఇండస్ట్రియల్ అండ్ ట్రేడ్ ఎక్స్‌పో బ్రోచర్‌ను సీఎం ఆవిష్కరించారు.

-డిక్కీ ప్రతినిధులతో సీఎం కేసీఆర్ -ఫిబ్రవరిలో పారిశ్రామిక ప్రదర్శన -బ్రోచర్‌ను ఆవిష్కరించిన సీఎం దళిత పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఇండస్ట్రియల్ పాలసీలో పలు అంశాలను పొందుపరిచిన విషయాన్ని ముఖ్యమంత్రి వివరించారు. హైదరాబాద్‌లోని నాస్‌డాక్‌లో దళిత ఇంజినీర్లకు మూడు నెలలపాటు శిక్షణ ఇచ్చి, కొంత పెట్టుబడి కూడా సమకూర్చుతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, పరిశ్రమల కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, డిక్కీ జాతీయ అధ్యక్షుడు మిలింద్ కాంబ్లే, సౌత్ ఇండియా కో ఆర్డినేటర్ రవి కుమార్, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రాహుల్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.