Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

కరోనాకు బెదరని సంక్షేమం

-పథకాలకు కేంద్రం నిధులు నిలిపినా
-వెనుకకు తగ్గని తెలంగాణ ప్రభుత్వం
-కోతల్లేకుండా పథకాలన్నీ కొనసాగింపు
-కష్టసమయంలో అన్నివర్గాలకు అండ

కరోనా కష్టకాలాన్ని అడ్డు పెట్టుకొని కేంద్రప్రభుత్వం బీద అరుపులు అరుస్తూ సంక్షేమ పథకాలకు కోత పెడుతున్నా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం తన సంక్షేమ గీతాలాపన ఆపలేదు. నెలవారీ ఆదాయం 90 శాతం తగ్గినా అన్ని సంక్షేమ పథకాలను దిగ్విజయంగా కొనసాగిస్తున్నది. తెలంగాణకు ప్రతినెలా రూ.12 వేల కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా, లాక్‌డౌన్‌ సమయంలో పది నుంచి 12 శాతమే వచ్చింది. అయినప్పటికీ ఆ ప్రభావం ఏమాత్రం కనిపించనీయకుండా ఆర్థికంగా సర్దుబాట్లు చేసుకుంటూ సంక్షేమబావుటా ఎగురవేసింది. దాదాపు 30వేల కోట్ల రూపాయలను వివిధ సంక్షేమ పథకాలకు, కరోనా సహాయానికి కేటాయించింది.. పంపిణీచేసింది.

కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ప్రధాన వ్యత్యాసమిదే. కేంద్రం ఈ కష్టకాలంలో ప్రజలకు అండగా నిలువాల్సిందిపోయి.. తన పథకాలన్నింటికీ నిధులు నిలిపివేసింది. పేదలను ఆదుకునేందుకు 20 లక్షల కోట్ల ‘ఆత్మనిర్భర్‌ అభియాన్‌’ అంటూ ఆర్భాటంగా ప్యాకేజీ ప్రకటించినా.. అది ‘అప్పుల’ కుప్పే. బ్యాంకుల ద్వారా రుణాలే తప్ప సామాన్యుడికి నేరుగా ఒక్కరూపాయి కూడా చేరే పరిస్థితి లేదు. దీంతో ప్యాకేజీ ప్రకటన సమయంలో హడావుడే త ప్ప.. ‘ఈ రకంగా అమలు చేస్తున్నాం. ఫలానా రంగాలకు ఈ నెలలో ఇన్ని నిధులు మంజూరు చేశాం’ అంటూ కేంద్రం లెక్కలు చూపించుకునే పరిస్థితిలోలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఉమ్మడి పథకాలకూ నిధులు కష్టమే
యూపీఏ హయాంలో 66 పథకాలు ఉండ గా.. మోదీ ప్రభుత్వం వాటిని 29కి తగ్గించింది. ఇందులో 26 పథకాలకు కేంద్రం 60% నిధులు ఇస్తే.. రాష్ర్టాలు 40% సమకూర్చుకోవాల్సి వస్తున్నది. ఒక్క ఉపాధి హామీ పథకానికి మాత్రం రాష్ర్టాల వాటా 25 శాతంగా ఉన్నది. ఆయా పథకాలకు కేంద్రం తన వాటా నిధులు విడుదల చే స్తే ఆర్థికవనరులు దెబ్బతిన్న ఈ కష్టకాలంలో ఆ పథకాలను ఏదో ఒకరకంగా కొనసాగించవచ్చని రాష్ర్టాలు భావించాయి. కేంద్రం వీటికి కూడా మొండిచేయి చూపించే అవకాశాలున్నాయి.

రాష్ర్టాలనూ ఆదుకోదు
లాక్‌డౌన్‌ కారణంగా రాష్ర్టాలు ఆర్థికంగా చితికిపోయాయి. 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ సిఫారసులతో సంబంధం లేకుండా అందరికీ నిధులు కేటాయిస్తారని రాష్ర్టాలు ఆశించాయి. కానీ కేంద్రం పక్షపాత వైఖరిని అవలంబించింది. రెవెన్యూలోటు ఉన్న రాష్ర్టాలకు కేంద్రం బుధవారం రూ.6,157 కోట్లు విడుదల చేసింది. వీటిని కేవలం 13 రాష్ర్టాలకే పరిమితం చేసింది.

తెలంగాణలో భిన్న పరిస్థితి
తెలంగాణ ప్రభుత్వం సంక్షేమం విషయం లో ఎక్కడా వెనుకకు తగ్గలేదు. ఉద్యోగుల వేతనాల్లో కోతవంటి కొన్ని పొదుపు చర్యలు పాటి స్తూ ఆ నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించింది. బడ్జెట్‌లో ఇచ్చిన హామీల్లో ఒక్కోదానిని నెరవేర్చుతూ.. కరోనా కారణంగా అవస్థలు పడుతున్న అన్ని వర్గాల ప్రజలను ఆదుకొన్నది.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమిదే..

రూ.25 వేలలోపు రైతులందరికీ రుణమాఫీ చేసింది. 55 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నిధులను జమ చేసింది. ఇందుకు దాదాపు రూ.6,900 కోట్లు వెచ్చించింది. కల్యాణలక్ష్మి పథకానికి రూ.675 కోట్లు విడుదల చేసింది. గత నెలలోనే షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేసింది. ధాన్యం కొనుగోలుకు రూ.12 వేల కోట్ల వరకు వెచ్చించింది. అన్ని పంటలకు కలిపి రైతులకు రూ.20వేల కోట్ల వరకు ఆదాయం వచ్చినట్టు అంచనా. వీటితోపాటు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో పింఛన్లకు రూ.2,565 కోట్లు, పేదలకు కరోనా సాయం (ఉచిత బియ్యం+రూ.1500 నగదు) కింద రూ.5,767 కోట్లు వెచ్చించింది. ఇలా రాష్ట్రప్రభుత్వం విపత్కర పరిస్థితుల్లో నూ సంక్షేమబాట వీడకుండా, దాదాపు ప్రతి కుటుంబానికి ప్రత్యక్షంగా సహాయం చేసింది. తమపర బేధం లేకుండా అందరికీ కడుపునిండా తిండిపెట్టడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన దక్షతను చాటుకున్నారు. మైనార్టీల సంక్షేమానికి రూ.304.90 కోట్లు విడుదల మైనార్టీల సంక్షేమాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.304.90 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి అహ్మద్‌నదీమ్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. షాదీముబారక్‌ పథకం అమలుకు రూ.150 కోట్లు, ఉర్దూ అకాడమీ, మైనార్టీ గురుకులాలు, హాస్టళ్ల నిర్వహణకు.. మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, క్రిస్టియన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కార్యక్రమాలకు రూ.53.18 కోట్లు విడుదలచేశారు. మైనార్టీ విద్యార్థుల ప్రీమెట్రిక్‌, పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల కోసం, సీఎం ఓవర్సీస్‌ స్టడీ పథకం అమలుకు రూ.86.68 కోట్లు, విద్యాభివృద్ధి కేంద్రం నిర్వహణ, హజ్‌ కమిటీ, వక్ఫ్‌బో ర్డ్‌, ఇమామ్‌, మైజామ్‌ల గౌరవ వేతనం చెల్లింపులు, స్టడీ సర్కిళ్ల ద్వారా విద్యార్థుల శిక్షణకు రూ.15.04 కోట్లు విడుదలచేశారు.

కష్టకాలంలోనూ కల్యాణలక్ష్మి
ఈ ఏడు రూ.2002.07 కోట్లు
కరోనా కష్టకాలంలోనూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ముందుగానే నిధులు సమకూర్చింది. కరోనా ప్రభావంతో పెండ్లిళ్ల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ఆర్థికసాయం కోసం వచ్చిన దరఖాస్తుల ఆధారంగా చెల్లింపునకు ఈ ఆర్థిక సంవత్సరం రూ.2002.07 కోట్లు అందుబాటులో ఉంచింది. ఇందులో గడచిన నాలుగు రోజుల్లోనే బీసీ, ఎస్టీ శాఖలకు కల్యాణలక్ష్మి కోసం రూ.875కోట్లు, షాదీముబారక్‌ కోసం మైనార్టీ సంక్షేమశాఖకు రూ. 150 కోట్లను విడుదల చేయడం విశేషం. 2020-21 సంవత్సరానికి గాను అన్ని కేటగిరీలకు సంబంధించి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ సాయంకోసం 1,04,985 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో అర్హులను గుర్తించి ఒక్కో యువతికి రూ. 1,00,116 చొప్పున ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ సాయం కోసం ఈ ఏడాది వచ్చిన దరఖాస్తులు.. నిధుల వివరాలు విభాగం

ఏడాదిపాటు కొత్త పథకాలేవీ లేవు. బడ్జెట్‌లో ప్రకటించిన పథకాలు కూడా అమలుకావు. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేవరకూ రాష్ర్టాలు మా వద్దకు ఎలాంటి ప్రతిపాదనలు తేవొద్దు.

– కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ గత నెల 5న చెప్పిన మాటలివి.

ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చాలి. ఎంతటి సంక్షోభం ఉన్నా సంక్షేమం ఆగొద్దు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండాలి.

– సీఎం కేసీఆర్‌ ఆలోచన ఇది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.