మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ రోజురోజుకూ మరింత సంచలనం సృష్టిస్తున్నది. సీఎం కేసీఆర్ సమక్షంలో ఆ రాష్ట్ర నేతల చేరికల జోరు కొనసాగుతున్నది. మహారాష్ట్రకు చెందిన ‘భూమి పుత్ర సంఘటన్’ ఆదివారం బీఆర్‌ఎస్‌లో విలీనమైంది. హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో సంఘటన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సంతోష్ వాడేకర్‌తోపాటు నేతలు కిరణ్ వాబ్లే, అవినాశ్ దేశ్‌ముఖ్, అశోక్ అందాలే, రాజన్ రోక్డే, అసిఫ్‌బాయి షేక్ తదితరులు బీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్ నేత సమాధాన్ అర్నికొండ, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన దీపక్ కొంపెల్వార్, యోగితాకొంపెల్వార్ రాము హాన్, త్రిలోక్ జైన్, సంతోష్ కాంబ్లే, అఖిల్ భారతీయ క్రాంతిదళ్ సంఘటన్‌కు చెందిన లక్ష్మికాంత్ భంగే తదితరులు సైతం బీఆర్‌స్ కండువా కప్పుకున్నారు.

బీఆర్‌ఎస్ నేతలు గణేశ్ కదమ్, సంతోష్ గౌర్ ఆధ్వర్యంలో గంగాధర్ మహరాజ్ కురుందర్, గణేశ్ మహరాజ్ జాదవ్, అనంత్ మహరాజ్ బార్వే, హరిబావు మహరాజ్, సంజీవ్ మహారాజ్, రాజ్‌కుమార్ మహరాజ్, శివాజీ మహరాజ్, ఉమాకాంత్ మహరాజ్, నకీఫ్‌నాథ్ మహరాజ్, వినాయక్ మహరాజ్, సంతోశ్ మహరాజ్, సురేశ్ మహరాజ్, పాండురంగ మహరాజ్, శ్రీకృష్ణ మహరాజ్, భగవాన్ శాస్త్త్రి, బాటాసాహెబ్ మహరాజ్, గణపతి మహరాజ్, శివాజీ మహరాజ్ బీఆర్‌ఎస్‌లో చేరారు.
నిఖిల్ దేశ్‌ముఖ్ ఆధ్వర్యంలో గోండ్వానా పార్టీ విదర్భ అధ్యక్షుడు ప్రణీత వికేసీ, యవత్మాల్‌కు చెందిన సామాజిక కార్యకర్త వర్ష కాంబ్లే పార్టీలో చేరారు. వీరందరికీ బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విదర్భకు చెందిన మహిళా బచత్ గాట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు కల్పన, పూనమ్ అలోర్ తదితరులు బీఆర్‌ఎస్‌కు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బాల సుమన్, మహారాష్ట్ర బీఆర్‌ఎస్ కిసాన్ సమితి అధ్యక్షుడు మాణిక్ కదమ్ పాల్గొన్నారు.