Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

అడవి బిడ్డలకు పట్టాభిషేకం..

-గిరిజనులకు పోడు పట్టాల పంపిణీని ప్రారంభించిన ముఖ్యమంత్రి
-ఆదివాసీ, గిరిజనుల మూడు డిమాండ్లు నెరవేర్చాం
-స్వయంపాలన, రిజర్వేషన్ల పెంపు, పోడు పంపిణీ
-గిరిజనులు దశాబ్దాలుగా కొట్లాడింది వీటికే: కేసీఆర్‌
-పోడు పట్టాలు పొందినవారికీ వెంటనే రైతుబంధు
-గిరిజనుల బావులకు రెండు నెలల్లో త్రీఫేజ్‌ కరెంటు
-గిరిజనులపై ‘పోడు’ కేసులన్నీ వెంటనే ఎత్తేస్తాం
-ప్రజలు, రైతుల కోసమే ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చాం
-ధరణిని ప్రజలు కావాలంటే.. కాంగ్రెస్‌ తీసేస్తమంటున్నది
-వార్దా నదిపై బ్రిడ్జి నిర్మాణానికి 75 కోట్లు మంజూరు
-ఆసిఫాబాద్‌ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌
-సమీకృత కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాలు ప్రారంభం

ఎక్కడో దూరంగా గుట్టల్లో, కొండల్లో, అడవుల్లో నివసించే గిరిజనం గోడు ఎవరికీ పట్టలేదు.
– ఇది చరిత్ర

దశాబ్దాలుగా అభివృద్ధికి ఆమడదూరంలో బతికే గిరిజన తండాలను పట్టించుకున్న నాథుడే లేడు. – ఇది గతం

తండాలన్నింటా వెలుగు రేఖలు ప్రసరించేలా& గిరిజనానికి పది శాతం రిజర్వేషన్లు దక్కాయి. ‘మావ నాటే మావ రాజ్‌’ అన్న వారి చిరకాల స్వప్నం సాకారమైంది. తండాలు, గూడేలు గ్రామపంచాయతీలయ్యాయి. తరాలుగా పరిష్కారం కాని పోడు భూముల సమస్య కొలిక్కి వచ్చి పట్టాలు చేతికందాయి. – ఇది వర్తమానం

ఇదంతా ఎలా సాధ్యమైంది? కేవలం ఒకే ఒక్క వ్యక్తి వల్ల.. మానవత్వం మూర్తీభవించిన పాలకుడి వల్ల.. కుమ్రంభీంకు అసలు సిసలైన వారసుడి వల్ల. అన్నివర్గాల సంక్షేమానికి పాటుపడుతున్న ప్రజా నాయకుడి వల్ల.. ఆయన మరెవరో కాదు. మన సీఎం కేసీఆర్‌. అసాధ్యాలను సుసాధ్యం చేయటం ఆయన ఘనత. భవిష్యత్తు తరాలు కూడా కోరుకునే అరుదైన నేత. జయహో కేసీఆర్‌.

గిరిజనులు, ఆదివాసీల దశాబ్దాల డిమాండ్లను నెరవేర్చిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్ర భుత్వానిదేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. ప్రధానంగా ఆదివాసీల మూ డు డిమాండ్లయిన స్వయంపాలన, రిజర్వేషన్ల పెంపు, పోడు భూముల పట్టాలను నిజం చేసి చూపామని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ శుక్రవారం కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పర్యటించారు. గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీని ప్రారంభించారు. జిల్లా నూ తన సమీకృత కలెక్టరేట్‌ను, ఎస్పీ కార్యాలయా న్ని ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పోడు పట్టాలు పొందిన గిరిజనులకు వెంటనే రైతుబంధును అమలుచేస్తామని తెలిపారు. రెండు నెలల్లో గిరిజనుల బావులన్నింటికీ త్రీ ఫేజ్‌ కరెంటు సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. అద్భుత పాలనా సంస్కరణగా గుర్తింపు పొందిన ధరణి పోర్టల్‌ను కాంగ్రెస్‌ పార్టీ తీసేస్తామని ప్రకటించిందని, ధరణి తీసేస్తే మళ్లీ దళారి రాజ్యం తప్పదని హెచ్చరించారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..

‘మావ నాటే.. మావ రాజ్‌’ నెరవేర్చాం
తెలంగాణ ఉద్యమంలో నేను ఈ అడవి ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు మీరంతా ‘మా వ నాటే.. మావ రాజ్‌’.. మా గూడెంలో మా రాజ్యం.. మా తండాలో మా రాజ్యం కావాలని చెప్పేవాళ్లు. దశాబ్దాలు పోరాటం చేసినా మీ ఆ శయం నెరవేరలేదు. కానీ, బీఆర్‌ఎస్‌ ప్రభు త్వం ఏర్పాటైన తర్వాత సుమారు 3 నుంచి 4 వేల గిరిజనగూడేలను, తండాలను గ్రామ పం చాయతీలుగా ఏర్పాటు చేశాం. మహనీయుడు, పోరాటయోధుడు కుమ్రంభీం పేరుపై జిల్లాను ఏర్పాటుచేశాం. ఉద్యమంలో మీరంతా నాతో ఉండి సహకరించారు కాబట్టే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చింది కాబట్టే కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా ఏర్పడింది. ఈ రోజు జిల్లాలో చక్కని ఎస్పీ, కలెక్టరేట్‌లను నిర్మించుకొన్నందుకు అందరికీ అభినందనలు.

పోడు పట్టాలతో పాటు రైతుబంధు
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పేదల బతుకులు బాగుపడాలని చాలా కార్యక్రమాలను అమలుచేసుకున్నాం. ఈ రోజు ఒక్క కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోనే 47 వేల ఎకరాల భూమిపై గిరిజనులకు పోడు పట్టాలు ఇస్తున్నాం. రేపటి నుంచి మీ మంత్రి, ఎమ్మెల్యేలు కూడా పట్టాలను పంపిణీ చేస్తారు. మూ డు నాలుగు రోజుల్లో పట్టాలన్నీ మీ చేతిలో ఉంటాయి. పోడు భూములకు పట్టాలు ఇవ్వడమే కాదు.. మిగిలిన రైతులందరికీ వచ్చినట్టుగానే పోడు పట్టాలు పొందే గిరిజన బిడ్డలకు ఈ సీజన్‌ నుంచే రైతుబంధు అందిస్తున్నాం.

మన్యం మంచం పడ్తలేదు
మన్యంలో ఇంత మార్పు వస్తుందని ఎవ రూ కలలో కూడా ఊహించి ఉండరు. ఒకప్పుడు వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ‘మంచం పట్టిన మన్యం’ అంటూ పేపర్లలో వార్తలు వచ్చేవి. అంటు రోగాలతో అదిలాబాద్‌ అడవి బిడ్డలు సతమతమై చాలా మంది చనిపోయేవారు. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీళ్లు ఇవ్వడంతోపాటు వైద్య వ్యవస్థను బాగు చేయడంతో ఈ రోజు మన్యం మంచంపట్టే సమస్య లేనేలేదు. గత మూడేండ్లుగా గిరిజన బిడ్డలకు ఈ తిప్పలు తప్పినయ్‌.

ధరణి ఉండాలా? తీసేయాలా?
ఉమ్మడి రాష్ట్రంలో చెట్టుకొకరు గుట్టకొకరై అనేక బాధలు పడ్డాం. అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా మనందరం కలిసికట్టుగా ఉద్యమించి ప్రత్యేక రా ష్ర్టాన్ని సాధించుకున్నాం. మరే రాష్ట్రంలో లేనివిధంగా సొంత రాష్ట్రంలో అద్భుత సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసుకొంటున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ గ్రామాలు ఎట్ల ఉండెనో, ఇప్పుడు ఎట్ల ఉన్నాయో మీరే చూ స్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలతో బ్రహ్మాండంగా ముందుకు సాగుతున్న రాష్ట్రంలో మళ్లీ కొంతమంది బయలుదేరి అవాకులు చెవాకులు పేలుతున్నారు. ధరణిని తీసేస్తామని కాంగ్రెస్‌ పార్టీ వాళ్లు చెప్తున్నారు. ధరణి పోతే మళ్లీ పైరవీకారుల మందలొచ్చి ప్రజలపై పడి దోచుకొంటాయి. నేను రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ధరణి ఉండాలని ఎంతమంది కోరుతున్నారని అడుగుతున్నా. అందరు ముక్తకంఠంతో ‘ధరణి ఉండాలి’ అని చెప్తున్నారు. ఆసిఫాబాద్‌ ప్రజలను కూడా అడుగుతున్నా.. ధ రణి ఉండాలా? తీసేయాలా? (ధరణి ఉండాలనుకొనేవారు చేతులెత్తాలని సీఎం కోరగా సభలోని ప్రజలంతా రెండు చేతులెత్తి ధరణి ఉండాలి, ఉండాలి అని పెద్ద పెట్టున నినదించారు). ప్రజలేమో ధరణి ఉండాలని కోరుకొంటుంటే.. కాంగ్రెస్‌ పార్టీ వాళ్లేమో తీసేస్తామని చెప్తున్నారు. ధరణి పోతే రైతుబంధు ఎలా వస్తది?. ధరణి పోతే మళ్లీ కాయితాలు పట్టుకొని సేట్ల చుట్టూ, బీట్ల చు ట్టూ తిరగాలి. ధరణి పోతే మన పట్టా మనకు ఇచ్చేందుకు ఆర్నెళ్లయినా పడుతది. దళారులకు లంచాలు ఇవ్వాల్సి ఉంటది.

రాష్ట్రంలో రైతే రాజు
కరెంట్‌ కోసం మనం ఎన్ని గోసలు పడ్డమో అందరికీ తెలుసు. గతంలో నేను ఆదిలాబాద్‌ జిల్లాకు వచ్చినప్పుడు కరెంట్‌ పోవడం, ఆర్ధరాత్రి బాయికాడ మోటర్లు పెట్టడానికి వెళ్లి కరెంట్‌ షాక్‌తో రైతులు చనిపోవడం చూశాను. ఇప్పుడు రాత్రి పూట రైతులు బావులకాడికి పోవాల్సిన అవసరం లేకుండా 24 గంటలపాటు కరెంట్‌ సరఫరా చేస్తున్నాం. ఇది దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదు. నయా పైసా బిల్లు లేకుండా ఉచిత కరెంట్‌ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ఇలాంటి సదుపాయాలన్నీ పెంచుకొంటూ అనేక రంగాల్లో మనం నంబర్‌ వన్‌గా నిలిచాం. తలసరి ఆదాయంలో, ప్రతి ఇంటికి నల్లా పెట్టి మంచినీళ్లు ఇచ్చే విషయంలో, గర్భిణీలకు ఇచ్చే కేసీఆర్‌ కిట్‌, రైతులు చనిపోతే ఇచ్చే రైతుబీమా, పెట్టుబడికి రైతుబంధు.. ఇలా అనేక కార్యక్రమాలను చేపట్టినం. గతంలో రైతులు చనిపోతే ఆపద్భందు అంటూ ఇచ్చేవాళ్లు. చెప్పులు అరిగేటట్టు తిరిగితే చివరికి రూ.10 వేలో, రూ. 20 వేలో చేతిలో పెట్టి పంపిచేవాళ్లు. కానీ, ఈ రోజు ధరణి పుణ్యమా అని ఎవరైనా రైతు ఏ కారణంతో చనిపోయినా రూ. 5 లక్షల చెక్కు వారంలోపల ఆ కుంటుంబం ఖాతాలో జమైతున్నది. ఇంత మంచి సదుపాయం ధరణి వల్లే సమకూరింది. మొన్నటి నుంచి రైతుబంధు డబ్బులు మీకూ వస్తున్నయ్‌. మీ సెల్‌ఫోన్‌ టింగ్‌టింగ్‌మని మోగుతున్నది. విత్తనాలు, ఎరువులకు ఆ డబ్బులు ఉపయోగపడుతున్నాయి.

పోడు కేసులన్నీ ఎత్తివేస్తం
పోడు భూములకు సంబంధించి గతంలో ఆదివాసీ, గిరిజన బిడ్డలపై కేసులు నమోదయ్యాయి. ఒకవైపు పోడు పట్టాలిస్తూ మరోవైపు కేసులు అలాగే ఉంటే దీనికి తలాతోక లేకుండా అవుతది. కాబట్టి గతంలో పోడు భూములకు సంబంధించి ఆదివాసీ, గిరిజనులపై పెట్టిన కేసులన్నీ ఆ శాఖ ఎత్తివేస్తది. ఇకపై ఎలాంటి కేసులు ఉండవు.

రాష్టంలో కలుస్తామంటున్న మహా ప్రజలు
ఒకప్పుడు ఆసిఫాబాద్‌ ప్రాంతానికి రోడ్డు సదుపాయం కూడా సరిగా లేదు. ఇప్పుడు అద్భుతమైన నాలుగు లైన్ల రోడ్డు వచ్చింది. మీ పక్కనే ఉన్న మహారాష్ట్రను చూడండి ఎలా ఉందో! తెలంగాణ పథకాలు తమకూ కావాలని వాళ్లు కోరుతున్నారు. లేదంటే తమను తెలంగాణలో కలపాలని అక్కడి సర్పంచులం తా నన్ను కలిశారు. మహారాష్ట్రలో ప్రజల కోరిక మేరకు అక్కడ కూడా బీఆర్‌ఎస్‌ పార్టీని విస్తరించాం. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తెలంగాణలో అమలు చేస్తున్నవన్నీ నూరుశాతం పేద ప్రజల పథకాలు. దళితబం ధు, గిరిజనులకు పోడు భూములు, గిరిజన హక్కులు, బీసీలకు రూ.లక్ష ఆర్థికసాయం ఇలా.. అనేక రకాల పథకాలతో ప్రజలే దేవుళ్లుగా భావించి సేవ చేస్తున్నాం. హాస్టళ్లలో విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెడుతున్నాం. గురుకులాలను అద్భుతంగా తీర్చిదిద్దాం. గురుకుల పాఠశాలను కళాశాలలుగా మార్చుకున్నాం. దేశంలో ఏ పరీక్ష జరిగినా మన గురుకుల విద్యార్థులు సత్తా చాటుతున్నా రు. ప్రతిష్ఠాత్మక మెడికల్‌, ఇంజినీరింగ్‌ కాలేజీల్లో సీట్లు సాధిస్తున్నారు. ఆదివాసీ, దళిత, మైనార్టీ, బీసీ బిడ్డల సముద్ధరణ కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నది.

సర్పంచులకు వందనం
ఆసిఫాబాద్‌ జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో గిరిజన గ్రామ పంచాయతీలు 162 ఉన్నాయి. కాగజ్‌నగర్‌ అతిపెద్ద మున్సిపాలిటీ. ఆసిఫాబాద్‌ కూడా మున్సిపాలిటీ అయ్యింది. త్వరలోనే నోటిఫికేషన్‌ వస్తుంది. కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌ ము న్సిపాలిటీలకు రూ.25 కోట్ల్ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నాం. 335 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున అభివృద్ధి నిధు లు ఇస్తున్నాం. సర్పంచ్‌లు ఆ నిధులతో పం చాయతీలను మరింత అభివృద్ధి చేయాలి. బీఆర్‌ఎస్‌ పాలనలో తొమ్మిదేండ్లలో గ్రామాల రూ పురేఖలే మారిపోయాయి. ఈ క్రెడిట్‌ అంతరా సర్పంచ్‌లదే. సర్పంచులందరికీ సెల్యూట్‌. దేశంలో ఎప్పుడు అవార్డులు ప్రకటించినా టాప్‌ 20 గ్రామ పంచాయతీల్లో 19 తెలంగాణవే ఉంటున్నాయి. టాప్‌ 10 గ్రామ పంచాయతీ అవార్డుల్లో 9 తెలంగాణకే వస్తున్నాయి. గతంలో మనిషి చచ్చిపోతే గ్రామాల్లో కాలబెట్టడానికి కూడా జాగ ఉండేది కాదు. ఈరోజు ప్రతి ఊరిలో వైకుంఠధామాలు కట్టుకున్నాం. ప్రతి గ్రామంలో ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్‌ ఉ న్నాయి. అడవుల విస్తీర్ణాన్ని బ్రహ్మాండంగా పెంచుతున్నాం. పరిశుభ్రత పాటిస్తున్నాం. ఈ క్రెడిట్‌ అంతా సర్పంచులు, బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షులు, జడ్పీ వాళ్లకే చెందుతుంది.

మంచిర్యాలకూ వరాలు
మంచిర్యాల జిల్లాకు కూడా ఆసిఫాబాద్‌ వేదికగానే నిధులు ప్రకటిస్తున్నాను. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలకు ఒక్కోదానికి రూ.25 కోట్లు, 311 గ్రామ పంచాయతీలకు ఒక్కోదానికి రూ.10 లక్షలు సీఎం నిధుల నుంచి ప్రకటిస్తున్నాను. మన అంతిమ లక్ష్యం పరిశుభ్రమైన మంచినీరు, పల్లె దవాఖాన, ప్రజల ఆ రోగ్యం, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య. ఇవన్నీ సంపూర్ణంగా గ్రామాల్లో జరిగితే అద్భుతంగా ఉంటుంది. ఆసిఫాబాద్‌ జిల్లాకు ఒక హామీ ఇస్తున్న. వార్ధా నది మీద బ్యారేజీ కూ డా మంజూరైంది. దీని ద్వారా 76 నుంచి 86 వేల ఎకరాలకు నీరు అందుతుంది. ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ నియోజకవర్గాలకు పూర్తిగా సాగునీరు అందుతుంది. బంగారు తెలంగాణను మరింత గొప్పగా తీర్చిదిద్దుకుందాం.

రాబోయే ఎన్నికల్లో మనదే గెలుపు
రాబోయే ఎన్నికల్లోనూ మనమే గెలవబోతున్నాం. అందులో ఎటువంటి సందే హం లేదు. ఈరోజు మీరు చూపించిన ప్రేమే ఇందుకు నిదర్శనం. 4 లక్షల ఎకరాల పోడు భూమికి కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా నుంచే శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉన్నది. జల్‌, జంగల్‌, జమీన్‌ నినాదంతో ఉద్యమం చేసిన మహానుభావుడు కుమ్రంభీం జిల్లా నుంచే ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం గర్వంగా ఉన్నది. చిన్న జిల్లా అయినప్పటికీ ప్రజలు భారీ సంఖ్యలో కదిలి రావడం అదృష్టం. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.

వార్దాపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.75 కోట్లు
‘మారుమూల ప్రాంతమైన ఆసిఫాబాద్‌లో ఇప్పుడు మెడికల్‌ కాలేజీ ఏర్పాటైంది. గతంలో కొనేరు కోనప్ప నా వెంటపడి బ్రిడ్జితోపాటు కొన్ని కొత్త మండలాలను ఏర్పాటు చేయించారు. ఇప్పుడు కౌటాల మండలం నుంచి మహారాష్ట్రకు వెళ్లేందుకు వార్ధా నదిపై బ్రిడ్జి కావాలని అడిగారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ.75 కోట్లు మంజూరు చేయడంతోపాటు ఆ జీవోను కూడా ఇప్పుడే కోనప్పకు అందజేస్తున్నాను. ఆసిఫాబాద్‌కు ఐటీఐ కా లేజీ కావాలని అడిగారు. దానిని కూడా మంజూరు చేస్తున్నాను. నాగమ్మ చెరువులో బుద్ధుడి విగ్రహం పెట్టుకొని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. దీన్ని మినీ ట్యాంక్‌బండ్‌గా ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు ఎంత ఖర్చు అవుతుందో లెక్కించి.. నాగమ్మ చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం’ అని సీఎం కేసీఆర్‌ సభలో చెప్పారు.

రెండు నెలల్లో త్రీఫేజ్‌ కరెంట్‌
గిరిజన ప్రాంతాల్లో ఎక్కడెక్కడ త్రీఫేజ్‌ కరెంట్‌ లేదో అక్కడ వెంటనే ఇవ్వాలని గతంలోనే అధికారులను ఆదిశించినం. ఇంకా కొన్ని ప్రాంతాలకు త్రీఫేజ్‌ కరెంట్‌ లేదని ఎమ్మెల్యే ఆత్రం సక్కు చెప్పారు. ఎక్కడెక్కడ త్రీఫేజ్‌ కరెంట్‌లో లేదో.. వారందరికీ రెండుమూడు నెలల్లో ఆ సౌకర్యం కల్పిస్తాం. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని సీఎస్‌ శాంతి కుమారిని ఆదేశించాం

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.